
MNR Arts productions ‘Oohaku Andanidi’ movie is launched by Singer Chitra.
ప్రముఖ నేపథ్య గాయని చిత్ర పాటతో ఘనంగా ప్రారంభమైన యం.యన్.ఆర్. ఆర్ట్స్ చిత్రం “ఊహకు అందనిది”
గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రముఖ నేపథ్య గాయని చిత్ర పాడిన శ్రీ రాముడా, కృష్ణుడా, ఈశ్వరుడా అనే పాట రికార్డింగ్ తో యం.యన్.ఆర్. ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైన నూతన చిత్రం “ఊహకు అందనిది”…ఈ సినిమాను భారీ బడ్జెట్ తరహాలో హై గ్రాఫిక్స్ తో పాటు అత్యంత హై టెక్నికల్ వేల్యూస్ కలిగిన నిర్మాణ విలువలతో నిర్మించబోతున్నారు . ఈ సినిమా టైటిల్ చదివినప్పుడు టైటిల్ లోనే సినిమా యొక్క బ్యాగ్రౌండ్ లైన్ ఎవరి ఊహకు అందదు అనే కాన్సెప్ట్ ని రివీల్ చేశారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ అనేది అందరికీ అర్థమవుతుంది. ఇప్పటివరకు వచ్చిన అమ్మోరు, అరుంధతి తరహా అత్యంత భారీ బడ్జెట్ సినిమాలకూ ఏ మాత్రం తీసిపోని విధంగా తీయడానికి సిద్ధపడుతున్నారు నిర్మాతలు. మంచి కంటెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో భారీ తారాగణం తో పాటు కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వడం విశేషం.హైదరాబాద్ తో పాటు చెన్నైలోనూ భారీ ఎత్తున సెట్టింగ్స్ వేసి షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు .ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ భారీ స్థాయిలో జరుగుతుంది. అత్యంత వైభవంగా ఏప్రిల్ లో షూటింగ్ మొదలు పెట్టి డిసెంబర్ లో చిత్రాన్ని పూర్తి చేసి జనవరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఈ సినిమాలోని నటీ, నటుల విషయాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
సంగీతం : మహావీర్
లిరిక్స్ : యం. యన్. ఆర్
రచన-దర్శకత్వం : యం.నాగేంద్ర (యం యన్. ఆర్)
పి .ఆర్.ఓ: లక్ష్మీ నివాస్
Related
Publisher: Source link

Aankhon Ki Gustaakhiyan Movie Review

Maalik Movie Review – Bollymoviereviewz

As Dull As Citadel, Just Add Humour
